11
1 నా బుద్ది సిల్లి పణిఙ్ మీరు కండెక్ ఓరిసినిదెర్ ఇజి నాను ఆస ఆజిన, నిజమె ఏలుబా మీరు ఓరిసినిదెర్.
2 మీ వందిఙ్ దేవుణు మన్సుదు మన్ని ఆస వజనె నానుబా మీ వందిఙ్ అయాలెకెండ్‌నె సత్తు మన్ని ఆసదాన్ మంజిన. ఎందనిఙ్ ఇహిఙ, ఒరెన్ దఙడః వందిఙ్ నాను మిఙి ప్రదానం కిత్త మన్న. అహిఙ, క్రీస్తు వందిఙ్ నాను మిఙి ఇని కల్తిసిల్లి ఉండ్రి విడిఃబోదెలి లెకెండ్ వన్నిఙ్ ఒపజెప్త మన్న.
3 గాని సరాస్ వన్ని సెఇ ఆలోసనమ్‌దాన్ అవ్వెఙ్ మోసెం కిత్తి లెకెండ్, మీ మన్సుబా తపు బోదెఙాణిఙ్ మోసెం కిబె ఆజి, మీరు క్రీస్తు ముస్కు మిఙి మన్ని ఇని కల్తిసిల్లి ప్రేమ డిఃసి సీజి, వన్ని బాణిఙ్ దూరం ఆనిదెర్లె, ఇజి నాను తియెల్ ఆజిన.
4 ఎందనిఙ్ ఇహిఙ, ఎయెన్‌బా మీ డగ్రు వాజి మాపు సాటిస్తి యేసుఙ్ ఆఏండ మరి ఒరెన్ యేసుఙ్ సాటస్తిఙ, మరి మా వెట మీరు పొందితి మని దేవుణు ఆత్మ ఆఏండ మరి ఉండ్రి ఆత్మ పొందితిఙ, అక్కాదె ఆఏండ మాపు వెహ్తి సువార్త ఆఏండ మరి ఉండ్రి సువార్త డగ్రు కిత్తిఙ, సులుగ మీరు వన్కాఙ్ లొఙిజి వరిఙ్ ఒరిసినిదెర్.
5 అయ గొప్ప పేరు పొందితికార్ ఆతి అపొస్తురు ఇంక నాను ఒద్దె తక్కుదికాన్ ఆఏ ఇజి నాను ఒడ్ఃబిజిన.
6 నాను నెగెణ్ వర్గిదెఙ్ నెస్‌ఇకాన్ ఆతిఙ్‌బా, గాని నాను గెణం సిల్లిక ఆఏ. మిఙి విజేరిఙ్ విజు పణిఙాణిఙ్, విజు మాటెఙాణిఙ్ మాపు అయ గెణం వందిఙ్ రుజుప్ కిజి తోరిస్త మనాప్.
7 మీ బాణిఙ్ ఇనికబా లొస్‌ఏండ దేవుణు సువార్త మీ నడిఃమి సాటిసి, మీరు పెరికిదెర్ ఆదెఙ్ ఇజి నఙి నానె తగె ఆతివలె నాను పాపం కిత్తానా?
8 మీ నడిఃమి దేవుణు పణికిదెఙ్ మహి సఙమ్‌కాణిఙ్ వరి డబ్బుఙ్ డొఙ కిత్తి లెకెండ్ వరి బాణిఙ్ కూల్లి లొసె ఆత.
9 నాను మీ నడిఃమి మహివలె, ఇనికబా అవ్‌సరం ఆతిఙ్‌బా, నాను ఎయెరిఙ్‌బా ఇనికబా లొస్‌ఏత. మాసిదోనియదాన్ వాతి తంబెరిఙ్ నా అవ్‌సరమ్‌కాఙ్ వందిఙ్ సిత్తార్. మీ బాణిఙ్ ఇనికబా లొస్‌ఏండ, నాను మిఙి ఉండ్రి బరు లెకెండ్ మన్‌ఏండ జాగర్తదాన్ మహి లెకెండ్‌నె వాని కాలమ్‌దుబా మంజిన.
10 క్రీస్తుఙ్ మని నిజం నా లొఇ మన్నిఙ్ అక్కాయ ప్రాంతమ్‌దు మనికార్ ఎయెర్‌బా నాను యా లెకెండ్ పొగ్‌డిఃజి వెహ్సిని దనిఙ్ అడ్డు కిదెఙ్ అట్‌ఏర్.
11 ఎందనిఙ్ నాను అయాలెకెండ్ మహ ఇహిఙ, మిఙి ప్రేమిస్‌ఇ వందిఙ్ ఆఏద్. నాను మిఙి ఎస్సొ ప్రేమిసిన ఇజి దేవుణు నెసినాన్.
12 గాని ఏలు కిజిని లెకెండ్‌నె నాను దేవుణు పణి కిజి మంజిన, అందెఙె మాపు కిజిని లెకండ్‌నె వారుబా దేవుణు పణి కిజినార్ ఇజి వెహ్తెఙ్ ఇజి ఆస ఆజిని వరిఙ్ మా వెట పొగ్‌డెః ఆదెఙ్ అక్కు సిల్లెండ మన్‍ఏద్ ఇజి.
13 వారు నన్నికార్, క్రీస్తుఙ్ అపొస్తురు లెకెండ్ వేసం పోకె ఆజి తోరె ఆతిమని మోసెం పణిఙ్ కిజిని మిఙి మోసెం కిత్తి డొఙ అపొస్తురు.
14 దన్ని వందిఙ్ బమ్మ ఆదెఙ్ అక్కర్ సిల్లెద్. సయ్తానుబా జాయ్ మని దూత లెకెండ్ వేసం పోకె ఆనాన్లె.
15 అందెఙె సయ్తాను వందిఙ్ పణి కినికార్, వారు వరిఙ్ వారె నీతి నిజాయితి పణిఙ్ కినివరి లెకెండ్ వేసం పోకె ఆతిఙ అక్క పెరిక ఆఎద్. వారు కిజిని పణిఙ తగితి లెకెండ్‌నె ఆకార్‌దిఙ్ వరిఙ్ జర్గినాద్‌లె.
పవులు వన్నిఙ్ వాతి కస్టమ్‌కాఙ్ వందిఙ్ పొగ్‌డిఃజినాన్.
16 నాను బుద్ది సిల్లికాన్ ఇజి ఎయెన్‌బా ఒడ్ఃబిదెఙ్ అఏద్ ఇజి నాను మరి మిఙి వెహ్సిన. నాను బుద్ది సిల్లికాన్ ఇజి మీరు ఒడ్ఃబిత్తిఙ ఆహె ఒడ్ఃబిదు. అందెఙె నానుబా కండెక్ పొగ్‌డెః ఆదెఙ్ అట్న.
17 యాలెకెండ్ నా మన్సుదు దయ్‌రం ఆజి పొగ్‌డిఃజినివలె, అక్క ప్రబు మాటెఙ్ వర్గితి లెకెండ్ ఆఏ, ఉండ్రి బుద్ది సిల్లివన్ని లెకెండ వర్గిజిన.
18 నండొండార్ యా లోకమ్‌దిఙ్ సెందితి వరి లెకెండ్ పొఙిజినార్, అందెఙె నానుబా అయా లెకెండ్‌నె పొఙిజిన.
19 మీరు గొప్ప బుద్ది మన్నికిదెర్‌గె. మీరు బుద్ది సిల్లివరిఙ్ సర్దదాన్ డగ్రు కిజినిదెర్.
20 ఒరెన్ మిఙి వెట్టిపణి కిని వన్ని లెకెండ్ కిత్తిఙబా, ఒరెన్ మోసం కిజి మిఙి మన్నికెఙ్ విజు లొసె ఆతిఙబా, ఒరెన్ మిఙి మోసెం కిజి వన్నిఙ్ లాబం తపిస్తిఙ్‌బా, మీ మొకొమ్‌దు డెఃయ్తిఙ్‌బా మీరు వన్నిఙ్ ఓరిసినిదెర్.
21 అయా లెకెండ్ వారు కిత్తి లెకెండ్ కిదెఙ్ మాపు సత్తు మనికాప్ ఆఏప్ ఇజి నాను సిగు ఆజి వెహ్సిన. గాని ఎయెన్‌బా ఇనిదన్ని వందిఙ్‌బా పొగ్‌డెః ఆదెఙ్ అక్కు మనాద్ ఇహిఙ, నఙిబా అయాలెకెండ్ పొగ్‌డెః ఆదెఙ్ అక్కు మనాద్. నాను ఒరెన్ బుద్ది సిల్లి వన్ని లెకెండ్‌నె వర్గిజిన.
22 వారు ఎబ్రివారునా? నానుబా ఎబ్రి వాండ్రునె. వారు ఇస్రాయేలుదికారా? నానుబా ఇస్రాయేలుదికానె. వారు అబ్రాహము కుటుమ్‌దికార్‌రా? నానుబా నన్నికాండ్రె.
23 వారు క్రీస్తు వందిఙ్ పణి కినికారా? నాను వెరి వన్ని లెకెండ్ వర్గిజిన. నాను క్రీస్తు వందిఙ్ మరి ఒద్దె పణి కిత్త మన్న. నాను నండొ కస్టబాడ్ఃజి పణి కిత్తమన్న. నండొ సుట్కు జెలిదు మహ. కొర్‌డెఃఙాణిఙ్ నండొ సుట్కు గొప్ప డెఃయె ఆత. నండొ సుట్కు సావుదిఙ్ డగ్రు ఆత.
24 యూదురు లోకుర్ బాణిఙ్ అయ్‌దు సుట్కు, ఉండ్రి తక్కు నలపయ్ దెబ్బెఙ్ తిహ.
25 మూండ్రి సుట్కు డుడ్డుదాన్ డెఃయె ఆత. ఉండ్రి సుటు పణకాణిఙ్ డెఃయె ఆత. మూండ్రి సుట్కు సందరమ్‌దు పయ్‌నం కిజి మహిఙ్ ఓడెఃఙ్ పెడెఃహిఙ్ బాద ఆత. ఉండ్రి రెయు పొగొల్ సందరమ్‌దు ఏరుదు మహ
26 ఎస్తివలెబా నాను పయ్‌నం కిజి మహిఙ్ నండొ సుట్కు పయనమ్‌దు పెరి గడ్డెఙాణిఙ్ ప్రమాదమ్‌కు వాతె. డొఙారిఙు వెట ప్రమాదమ్‌కు వాతె. మా సొంత జాతిదికారాతి యూదురి వెట ప్రమాదమ్‌కు వాతె. పట్నమ్‌దు ప్రమాదమ్‌కు వాతె. అడిఃవిదు ప్రమాదమ్‌కు వాతె. సందరమ్‌దు ప్రమాదమ్‌కు వాతె. డొఙ తంబెరిఙ వెట ప్రమాదమ్‌కు వాతె.
27 నాను నండొ కస్టమ్‌దాన్ స్రమెఙాణిఙ్ పణిఙ్ కిజి, రెయ్క నిద్ర సిల్లెండ మహ. ఏక, ఏక తిండి సిల్లెండ బఙ ఎహ్కిదాన్ మహ. ఒడొఃల్‌దు సొక్కెఙ్ సిల్లెండ పిన్నిదు నిగసాణె మహ.
28 యాకెఙె ఆఏండ విజు దేవుణు సఙమ్‌కాఙ్ వందిఙ్ ఎలాగ ఆనెనొ ఇజి రోజు మన్సుదు ఒడ్ఃబిజి మహ.
29 సత్తు సిల్లికాన్ ఎయెన్ మనాన్? నానుబా సత్తు సిల్లికాన్ ఆఏనా? ఎయెన్ పాపమ్‌దు తొరొడె ఆజినానా? నఙి మన్సుదుబా కోపం రెఙె ఆఏదా?
30 నాను పొగ్‌డెః ఆదెఙ్‌వలె ఇహిఙ నఙి మన్ని సత్తు సిల్లి వన్కా వందిఙ్‌నె నాను పొగ్‌డిఃనాలె.
31 నాను వర్గిజినిక అబద్దం ఆఏద్ ఇనిదన్నిఙ్ ఎస్తివలెబా పొగిడెః ఆజిని మా ప్రబువాతి యేసుఙ్ బుబ్బాతి దేవుణునె నెసినాన్.
32 దమస్కు పట్నమ్‌దు నాను మహివలె, రాజు ఆతి అరెత అడిఃగి మన్నికానాతి అదికారి నఙి అస్తెఙ్ ఇజి దమస్కు పట్నం విజు కాపు ఇడ్తాన్.
33 నస్తివలె పట్నమ్‌ది కోట గోడాఃదు మన్ని కిటికి బొరొదాన్, గంపదు డిఃపె ఆతానె వన్ని కియుదాన్ తప్రె ఆత.