120
యాత్ర కీర్తన.
నేను కష్టంలో ఉన్నాను.
సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను.
ఆయన నన్ను రక్షించాడు.
యెహోవా, మోసకరమైన నాలుకనుండి,
నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.
 
అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా?
మీరేమి పొందుతారో మీకు తెలుసా?
మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని,
మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.
 
అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది.
అది కేదారు* గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
నాకు శాంతి కావాలి. అది నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.
 
* 120:5 మెషెకులొ … కేదారు ఈ స్థలాల్లో వుండిన ప్రజలు ప్రసిద్ధికెక్కిన యుద్ధ వీరులు.