7
అతను ఆమె అందాన్ని ఇలా ప్రశంసిస్తాడు 
 
1 రాకుమారీ, ఆ పాదరక్షల్లో నీ పాదాలెంతో అందంగా ఉన్నాయి  
నీ తొడల వంపులు శిల్పి మలిచిన ఆభరణాల్ల ఉన్నాయి.   
2 నీ నాభి గుండ్రటి కలశంలా ఉంది  
దానికెన్నడూ ద్రాక్షారసం కొరత లేకుండుగాక.  
నీ ఉదరం పద్మ వలయితమైన  
గోధుమ రాశిలా ఉంది.   
3 నీ స్తనాలు లేజవరాలైన జింక  
అప్పుడే కన్న కవల పిల్లల్లా ఉన్నాయి.   
4 నీ మెడ దంతపు గోపురంలా ఉంది  
నీ నేత్రాలు బాత్ రబ్బీన్ సరసన ఉన్న  
హెష్బోనులోని తటా కాల్లా ఉన్నాయి.  
నీ నాసిక దమస్కు దిక్కుకి చూచే  
లెబానోను శిఖరంలా ఉంది.   
5 నీ తల కర్మెలు పర్వతంలా,  
నీ తల నీలాలు పట్టుకుచ్చుల్లా వున్నాయి.  
నీ సుదీర్ఘ కేశాలు చూసిన రాజు కూడా  
నీ వశం అవుతాడు.   
6 నీవు అతిలోక సుందరివి! అత్యంత మనోహరివి!  
ప్రియదర్శినివి! అందమైన, ఆహ్లాదకరమైన యువతివి!   
7 నీవు తాళవృక్షంలా పొడుగరివి.  
నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి.   
8 నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని,  
దాని మట్టలు పట్టాలని ఉంది.  
   
 
నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా నీ ఊపిరి  
ఆపిలు సువాసనలా ఉన్నాయి.   
9 నీ నోరు శ్రేష్టమైన ద్రాక్షారసంలా అది  
నీ నోట జాలువారి నిద్రాముద్రిత ప్రియుని  
అధరాలను స్పృజించే మధువులా ఉండాలి.   
ఆమె అతనితో అంటుంది 
 
10 నేను నా ప్రియునిదానను  
నన్నతను వాంఛిస్తాడు!   
11 ఓ నా ప్రియుడా రా,  
చేలల్లోకి పోదాము రా,  
పల్లెల్లో రేయి గడుపుదాము రా,   
12 పెందలకడ లేచి ద్రాక్షాతోటలకు పోదాము  
ద్రాక్షా తీగలు మొగ్గ తొడిగాయో  
లేదో ఆ మొగ్గలు విచ్చుకున్నాయో  
లేదో దానిమ్మ చెట్లు విరబూశాయో లేదో తనివితీరా చూద్దాము. రా.  
అక్కడ నేనిచ్చునా ప్రేమ అందుకొన రా.   
   
 
13 ప్రేమ వర్ధక మండ్రేక ఓషధుల్నీ  
మా గుమ్మాన వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు!  
ఓ నా ప్రియుడా, నీకై దాచి ఉంచాను ఎన్నెన్నో పండువీ,  
దోరవీ పండ్లు తిని చూడు!