కీర్తన 123
యాత్రకీర్తన. 
 
1 పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా,  
మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను.   
2 దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు,  
దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు,  
మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు  
మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.   
   
 
3 మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి,  
ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము.   
4 మేము గర్విష్ఠుల  
అంతులేని ఎగతాళిని,  
అహంకారుల ధిక్కారాన్ని భరించాము.